ఈనెల 14నుంచి 23వరకు మరోసారి లాక్ డౌన్

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సండలించిన అనంతరం పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. చైనా దేశం కంటే ఎక్కువగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ తర్వాత తమిళనాడు, ఢిల్లీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేసులు ఎక్కవు అవుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు.

తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరులో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించనుంది సర్కార్.ఈనెల 14 నుంచి 23వరకు బెంగళూరు పట్టణ, గ్రామీన జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*