కరుడు గట్టిన నేరస్తుడు వికాస్ దుబేను హతమార్చిన పోలీసులు

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కరుడు గట్టిన నేరగాడు వికాస్ దుబేను పోలీసులు హతమార్చారు. నిన్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో వికాస్‌ను పోలీసులు పట్టుకోగా ఇవాళ కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడింది. దీంతో ఇదే అదునుగా తప్పించుకోవడానికి వికాస్ ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. వికాస్‌ మృతదేహాన్ని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు.

కాగా వికాస్ దుబే భారీగా అక్రమ ఆస్తులు సంపాదించడంతో అతడి ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇటివలే వికాస్ దుబేను పట్టుకునేందుకు ఇంటికి వెళ్లిన 8మంది పోలీసులను కాల్చి చంపారు వికాస్ దుబే అనుచరులు. ఈకేసును సీరియస్ గా తీసుకున్న యూపీ పోలీసులు అతడిపై సిరీయస్ సెర్చ్ చేశారు. దీంతో యూపీలోని వికాస్ ఇంటిని ఆస్తులను ధ్వంసం చేశారు. వికాస్ దూబేకు 12 ఇండ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు ఇప్ప‌టికే గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*