టిక్ టాక్ అభిమానులకు గుడ్ న్యూస్…మరో అవకాశం ఇచ్చిన కేంద్రం

చైనాకు సంబంధించిన టిక్ టాక్ యాప్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. దీంతో చాలా మంది టిక్ టాక్ ఆకర్షితులయ్యారు. కాగా ఇటివలే చైనా ఇండియా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం చైనాకు సంబంధించిన 59రకాల యాప్ లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి యాప్ యాజమాన్యానికి 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు పంపారు.

ఇండియాలో టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయడంతో టిక్ టాక్ సంస్ధ భారీగా నష్టపోయింది. జులై 22లోపు ఈ సంస్ధల యాజమాన్యాలు వివరణ ఇవ్వాలని కోరింది కేంద్రం. తాజాగా ఉన్నసమాచారం మేరకు టిక్ టాక్ హెడ్ ఆఫీస్ ను చైనాలో కాకుండా ఇతర దేశంలో పెట్టెందుకు ఆలోచన చేస్తున్నారట టిక్ టాక్ యాజమాన్యం. వేరే దేశం నుంచి టిక్ టాక్ ను నడపనున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా యాప్ లోగోతో పాటు పేరును కూడా మార్చనున్నారని సమాచారం. త్వరలోనే ఈయాప్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*