తెలంగాణ ఇంటర్ విద్యార్దులకు గుడ్ న్యూస్…

దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదుఅవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు విద్యాసంస్ధలను మూసేసిన సంగతి తెలిసిందే. కాగా కరోనా నేపథ్యంలో ఇటివలే 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

మార్చి 2020 ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు జులై 31 తర్వాత సంబంధిత కళాశాలల్లో మార్కుల మెమోలు జారీచేస్తారని తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో1.47 లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*