మెగాస్టార్ కు కరోనా పాజిటివ్…షాక్ లో అభిమానులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజు రోజుకి వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో వేల సంఖ్యల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతుంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ , బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబాయ్ లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. గత 10రోజుల నుంచి తనను కలిసిన వారంతా టెస్ట్ లు చేయించుకోవాలని తెలిపారు.

కాగా అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు ఖరారైంది. బాలీవుడ్ స్టార్ హీరోలకు కరోనా రావడంతో త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. అమితాబ్ తొందరగా కోలుకొవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు ప్రార్ధించారు ప్రధాని మోదీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*