NATIONAL NEWS

ఈనెల 14నుంచి 23వరకు మరోసారి లాక్ డౌన్

lockdown

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సండలించిన అనంతరం పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. మన దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. చైనా దేశం కంటే ఎక్కువగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ తర్వాత తమిళనాడు, ఢిల్లీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేసులు ఎక్కవు అవుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరులో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించనుంది ...

Read More »

మెగాస్టార్ కు కరోనా పాజిటివ్…షాక్ లో అభిమానులు

amitab

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజు రోజుకి వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో వేల సంఖ్యల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతుంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ , బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబాయ్ లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. గత 10రోజుల నుంచి తనను కలిసిన వారంతా టెస్ట్ లు చేయించుకోవాలని ...

Read More »

టిక్ టాక్ అభిమానులకు గుడ్ న్యూస్…మరో అవకాశం ఇచ్చిన కేంద్రం

tik tok

చైనాకు సంబంధించిన టిక్ టాక్ యాప్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. దీంతో చాలా మంది టిక్ టాక్ ఆకర్షితులయ్యారు. కాగా ఇటివలే చైనా ఇండియా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం చైనాకు సంబంధించిన 59రకాల యాప్ లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి యాప్ యాజమాన్యానికి 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు పంపారు. ...

Read More »

కరుడు గట్టిన నేరస్తుడు వికాస్ దుబేను హతమార్చిన పోలీసులు

vikas dube

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కరుడు గట్టిన నేరగాడు వికాస్ దుబేను పోలీసులు హతమార్చారు. నిన్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో వికాస్‌ను పోలీసులు పట్టుకోగా ఇవాళ కాన్పూర్ తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడింది. దీంతో ఇదే అదునుగా తప్పించుకోవడానికి వికాస్ ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. వికాస్‌ మృతదేహాన్ని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా వికాస్ దుబే భారీగా అక్రమ ఆస్తులు సంపాదించడంతో అతడి ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇటివలే వికాస్ దుబేను పట్టుకునేందుకు ఇంటికి వెళ్లిన ...

Read More »

కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక ప్రకటన

corona

కరోనా మహామ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 10లక్షల మందికి ఈ వైరస్ సోకింది. కాగా మన దేశంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకి వేల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నాయి. కాగా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అని ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇండియా నుంచే మొదటగా కరోనాకు మందు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మన ఫార్మా కంపెనీలు. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకైతే సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని ...

Read More »

ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య

దిశ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నిందితుడు చెన్నకేశవులకు భార్య ఉన్న సంగతి తెలిసిందే. చెన్నకేశవులు ఎన్ కౌంటర్ జరగకముందే ఆయన భార్య రేణుక గర్భిని. తాజాగా చెన్నకేశవులు భార్య రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులు రావడంతో మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రిలో చేర్పించగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.చెన్నకేశవులు గతేడాది డిసెంబర్ 6న షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌‌లో మరణించే ...

Read More »

బ్రేకింగ్ న్యూస్.. అక్కేనేని అఖిల్ కు గాయాలు

అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తున్నారు. ఇటివలే ఈమూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ 80శాతం వరకు చిత్రకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో కీలక యాక్షన్ సన్నివేశాలు చెన్నైలో చిత్రీకరిస్తుండగా.. అఖిల్ గాయపడినట్టు తెలుస్తోంది. అఖిల్ భూజానికి గాయం కావడంతో వారం రోజుల పాటు షూటింగ్‌కి దూరంగా ...

Read More »

ఈనెల 20వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతో పాటు శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు. ఈ నెల 8వ తేదీ(ఆదివారం)న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 8న ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 20 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగనుండగా మొత్తం 12రోజులు సభ జరుగనుంది. ఈనెల 9,10,15 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. అవసరమైతే సమావేశాల నిడివి పొడిగించనున్నట్లు తెలిపారు. ...

Read More »