యాంకర్ గా మారిన విజయ్ దేవరకొండ దర్శకుడు

పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. తెలంగాణ యాసలో సినిమా తీసి జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. దర్శకత్వంతో పాటు ఈమధ్య హీరోగా కూడా ఓ సినిమా చేశాడు. మీకు మాత్రమే చెప్తా అంటూ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు.

దర్శకత్వం, నటనతో పాటు ఇప్పుడు మరో రంగంలో అడుగుపెట్టాడు తరుణ్ భాస్కర్. ఈటీవీ ప్లస్‌లో నీకు మాత్రమే చెప్తా అంటూ ఓ షో మొదలుపెట్టాడు తరుణ్. ఇందులో టాలీవుడ్ దర్శకులను ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు. రెగ్యులర్ ఇంటర్వ్యూలలా కాకుండా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. మొదటి ఎపిసోడ్ లో సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడితో ఈ షోను ప్రారంభించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*